Tuesday, April 22Welcome to Vandebhaarath

Business

Business, Financial, Gold and silver Price, Petrol diesel, Economy, Market Trends GDP, GST,

LPG Rates : ఉజ్వల, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు
Business

LPG Rates : ఉజ్వల, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు

LPG Rates : ఉజ్వల్ పథకం, (PMUY), ఉజ్జ్వల్ పథకం కాని వినియోగదారులకు రేపు ఉదయం నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) ధర సిలిండర్‌కు రూ.50 పెరుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం తెలిపారు. వంట గ్యాస్ లేదా ఎల్‌పిజి ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని చెప్పారు. దీనితో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్ (LPG Rates ) ధర రూ.500 నుండి రూ.550కి పెరుగుతుంది. ఇతరులకు, ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.803 నుండి రూ.853కి పెరుగుతుంది. రెండు వారాల తర్వాత ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని మంత్రి చెప్పారు.LPG ధరల పెంపు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించబడుతుంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా మార్చబడుతుంది, అని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ( BPL ) కుటుంబాలకు చెందిన మ...
Cash withdrawal | ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే బాదుడే.. మే 1 నుంచి కొత్త ఛార్జీలు – వివరాలు..
Business

Cash withdrawal | ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే బాదుడే.. మే 1 నుంచి కొత్త ఛార్జీలు – వివరాలు..

ATM Cash withdrawal : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ATM నుంచి నగదు విత్ డ్రా పై ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏటీఎం నగదు ఉపసంహరణలు మే 1 నుంచి మరింత ఖరీదైనవిగా మారుతాయని దూరదర్శన్ న్యూస్ నివేదిక తెలిపింది. ఈ మార్పు తరచుగా డబ్బులను డ్రా చేసుకునేందుకు ఎక్కువగా ATM లను ఉపయోగించే వారిపై ప్రభావం చూపనుంది. ATM ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే ఒక బ్యాంకు ATM లావాదేవీలను సులభతరం చేయడానికి మరొక బ్యాంకు చెల్లించే మొత్తం. బ్యాంకులు సాధారణంగా ఈ ఖర్చును కస్టమర్లపైకి బదిలీ చేస్తాయి. ఉదాహరణకు, ఒక ICICI బ్యాంక్ కస్టమర్ హైదరాబాద్ లోని SBI ATM నుంచి డబ్బును డ్రా చేసుకుంటే ICICI బ్యాంక్ ఒక నెలలో SBI ATMలో మూడవ లావాదేవీ తర్వాత రుసుము వసూలు చేసే అవకాశం ఉంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నందున అధిక Cash withdrawal ఛార్జీలను కోరుతూ వైట్-లేబుల్ ATM ఆపరేటర్ల అభ్యర్థనల మ...
Business

Google Pay, PhonePe, Paytm users : ఏప్రిల్ 1 నుండి ఈ మొబైల్ నంబర్లలో యుపిఐ పనిచేయదు

Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా UPIని ఉపయోగించే వారికోసం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. ఈ నిబంధనల ప్రకారం.. UPIకి లింక్ అయిన మొబైల్ నంబర్‌లు ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా లేకుంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. మీ బ్యాంక్ ఖాతా ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే అది తొలగించబడుతుంది. UPI చెల్లింపులు చేయడానికి ప్రయత్నించేటప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, UPI వ్యవస్థలలో సాంకేతిక లోపాలను సృష్టించవచ్చని అధికారులు వారు పేర్కొంటున్నారు. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయించినట్లయితే, అది మోసానికి అవకాశం పెంచుతుంది. ప్రభుత...
Business

GOLD RATE TODAY | బంగారు నగలు ఇప్పుడు కొనవచ్చా? ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

GOLD RATE TODAY | దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ 91,088 పలకగా బుధవారానికి రూ.422 పెరిగి రూ.91,510కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.1,03,387 పలకగా బుధవారం నాటికి రూ.193 పెరిగి రూ.1,03,580 లకు చేరింది . Gold Price In Hyderabad : హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.91,510 గా ఉంది. ఇక వెండి ధర కిలోకు రూ.1,03,580 పలుకుతోంది. Gold Price In Visakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.91,510గా ఉంది. కిలో సిల్వర్ ధర రూ.1,03,580గా ఉంది. Gold Price In Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.91,510 లుగా ఉంది. కిలో వెండి రూ.1,03,580 ధర పలుకుతోంది . Gold Price In Proddatur : ఇక ప్రొద్దుటూరులో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.91,510గా ఉంది. కిలో సిల్వర్ రూ.1,03,580 దర పలుకుతోంది. GOLD RATE TODAY : ప్రధాన నగరాల్లో బంగారం, ...
Business, Career

small business idea : న‌మ్మ‌క‌మైన బిజినెస్ చేయాల‌నుకుంటున్నారా? అయితే IRCTCలో చేరి డబ్బు సంపాదించండి..

Business With Indian Railways : మీరు కొత్త వ్యాపారం చేసి డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకుంటున్నారా? మీ దగ్గర తక్కువ డబ్బు ఉన్నా కూడా చింతించకండి. చాలా మొత్తంతో కొత్త బిజినెస్ ప్రారంభించ‌డానికి ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రైల్వేలకు చెందిన ఐఆర్‌సిటిసి కూడా గోల్డెన్ చాన్స్‌ అందిస్తోంది. టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. దానితో మీరు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో మరింత తెలుసుకోండి. IRCTC లో దరఖాస్తు చేసుకోవాలి ముందుగా మీరు IRCTC టికెట్ ఏజెంట్ కావాలనుకుంటే IRCTC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. ఏజెంట్ కావడానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులభం. మీరు ఈ పనిని కేవలం కొన్ని ధ్రువ‌ పత్రాలతో చేయవచ్చ...
Business

EPFO EDLI Scheme | PF ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. కొత్త అప్ డేట్ ఇదే..

EPFO EDLI Scheme New Rules 2025 : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 237వ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో కీలక మార్పులను ప్రకటించింది. సర్వీసులో ఉండగా ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సవరణలను చేశారు. EPFO EDLI Scheme అంటే ఏమిటి? EDLI పథకం ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో భాగం. ఇది సామాజిక భద్రతను అందిస్తుంది .ఈ పథకం కింద ఒక EPF సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. EDLI పథకంలో ముఖ్యమైన మార్పులు కనీస బీమా ప్రయోజనం గతంలో ఒక ఉద్యోగి తన మొదటి సంవత్సరం సర్వీసులో మరణిస్తే, ఆ కుటుంబానికి బీమా మొత్తం అందేది కాదు. కానీ కొత్త నిబంధనలలో కనీసం ₹50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం 5,000 కంటే ఎక్కువ కుటుంబ...
Business

PM Surya Ghar Yojana : 6.75 శాతం వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు పొందండి.

PM Surya Ghar Muft Bijli Yojana : ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్‌టాప్ సౌర విద్యుత్ కార్యక్రమం అయిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద ఇప్పటివరకు 10 లక్షల ఇళ్లకు సౌరశక్తిని అందించింది. అక్టోబర్ నాటికి 20 లక్షల ఇళ్లకు సోలరైజేషన్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2027 నాటికి కోటి ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది. "ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఇప్పటివరకు 1 మిలియన్ ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా అవుతోందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. PM Surya Ghar Yojana : పథకం అంటే ఏమిటి ? Muft Bijli Yojana : దేశవ్యాప్తంగా పర్యావరణ హితమైన సౌర విద్యుత్ ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దీని కింద ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ (Solar Panels) ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 40 శా...
Business

EPFO 3.0 : ఇక‌పై మీ PF డ‌బ్బుల‌ను ATM ల నుంచి కూడా డ్రా చేసుకోవ‌చ్చు..

EPF withdrawals: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 'EPFO 3.0' తో ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను తీసుకువస్తోంది. ఇది PF డ‌బ్బుల‌ను సుల‌భంగా విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంది.చందాదారులు త్వరలో సాధారణ బ్యాంకు లావాదేవీల మాదిరిగానే ATM ల నుంచి మీరు నేరుగా ప్రావిడెంట్ ఫండ్‌ను డ్రా చేసుకోవ‌చ్చు. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ కొత్త వ్యవస్థను న‌గ‌దు లావాదేవీలను సరళీకృతం చేయడానికి ప్రవేశపెతున్న‌ట్లు పేర్కొన్నారు. PFO తన చందాదారులకు బ్యాంకింగ్ లాంటి సౌలభ్యాన్ని తీసుకువచ్చే 'EPFO 3.0'ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. "రాబోయే రోజుల్లో, EPFO ​​3.0 వెర్షన్ వస్తుంది. దీని అర్థం EPFO ​​బ్యాంకులా మారుతుంది. లావాదేవీలు బ్యాంకులో నిర్వహించబడినట్లుగా, మీరు (EPFO చందాదారులు) మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) కలిగి ఉం...
Business

Navratna status | ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సిలకు నవరత్న హోదాకు పెంచిన కేంద్రం

Navratna status | న్యూఢిల్లీ: నికర లాభం, నికర విలువల‌ను గ‌ణ‌నీయంగా వృద్ది చేసుకుని అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) హోదాకు అప్‌గ్రేడ్ చేసింది. తాజా ప్రకటనతో IRCTC, IRFC లు CPSEలలో వరుసగా 25వ, 26వ నవరత్నాలుగా నిలిచాయి. ఇది భారత రైల్వే కంపెనీలకు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. Navratna status : న‌వ‌ర‌త్న హోదాతో లాభ‌మేంటి? కొత్త నవరత్న హోదాతో ఈ రెండు కంపెనీలకు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స్వయంప్రతిపత్తిని ల‌భిస్తుంది. ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారి భవిష్యత్ వృద్ధి ప్రణాళికలలో వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు క‌లుగుత...
Business

Pension Scheme | అసంఘటిత కార్మికులకూ పెన్షన్.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా దరఖాస్తు చేయాలి ?

Pension Scheme - PM Shram Yogi Mandhan Yojana : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు కూడా గొప్ప ప‌థ‌కాన్ని అందిస్తోంది. భారతదేశంలో వారి ప్రస్తుత ఆదాయం ఆధారంగా భవిష్యత్ కు భ‌రోసా ఇచ్చేందుకు పెన్ష‌న్ అందించే ప‌థ‌కం ఇది. అసంఘ‌టిక కార్మికుల కోసం ప్రభుత్వం 2019 లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కార్మికులకు ప్రతి నెలా పెన్షన్ అందిస్తారు. ఈ పథకం వల్ల ఏ కార్మికులు ప్రయోజనం పొందుతారో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం.. Pension Scheme : రూ. 3000 వరకు పెన్షన్ ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన తో ప్రధానంగా దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం ద్వారా, కార్మికులకు ప్రతి నెలా రూ. 3000...
Exit mobile version