Saturday, March 1Thank you for visiting

Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Spread the love

Budget 2024 | ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి  అనేక కీలకమైన అంశాలనుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.  మంగళవారం 2024-25 బడ్జెట్‌లో యువత విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 ట్రిలియన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేటాయించిన రూ.1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ.
కాగా తన ఏడవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, బడ్జెట్ ఉపాధి, నైపుణ్యం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME),  మధ్యతరగతి పరిశ్రమల ప్రగతిపై  దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు బడ్జెట్‌లోని తొమ్మిది ప్రాధాన్యతలను ఆమె పేర్కొన్నారు.

సీతారామన్ ఉపాధి, నైపుణ్యం కోసం మొత్తం 2 ట్రిలియన్ రూపాయలతో ఐదు పథకాలను కూడా ప్రకటించారు. దేశంలో ఉద్యోగాలు, నైపుణ్యం ప్రధాన అంశాలని, వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల మంది యువతకు నైపుణ్యం లభిస్తుందని సీతారామన్ చెప్పారు. “భారత ప్రజలు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని బలపరిచారు. అందుకే  మూడవసారి తిరిగి ఎన్నుకున్నారు” అని ఆమె అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధాన అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. భారత ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగుతోందని, 4 శాతం లక్ష్యం దిశగా పయనిస్తోందని సీతారామన్ పేర్కొన్నారు.

Budget 2024 లో ఏటా 25వేల మంది విద్యార్థులకు సహాయం చేయడానికి మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఈ-వోచర్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం అందిస్తామని.. ప్రతి సంవత్సరం, దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం లక్ష మంది విద్యార్థులకు 3శాతం వార్షిక వడ్డీతో నేరుగా రూ.10 లక్షల రుణం ఇస్తామన్నారు. అంతేకాకుండా, హబ్, స్పోక్ మోడల్‌లో 1,000 ఐటీఐలు అప్‌గ్రేడ్ చేయబడతాయన్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version