Friday, March 14Thank you for visiting

“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

Spread the love

బ్రౌన్, మల్టీగ్రెయిన్ రకాలు ఆరోగ్యకరమైనవి కావట

విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్

మనం గొప్పగా చెప్పుకునే ఆహార పదార్థాల గురించి లోతైన విశ్లేషనలు చేసి నిజానిజాలను వెల్లడిస్తుండారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన Revant
Himatsingka. ఈయన గతంలో బోర్న్‌విటాలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోగా అవి వైరల్ అయ్యాయి.
దీనిపై క్యాడ్‌బరీ కంపెనీ అతనిపై లీగల్ నోటీసును కూడా పంపింది. ఇదిలా ఉండగా తాజాగా హిమత్‌సింకా వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ లసౌ సంచలన నిజాలు బయటపెట్టారు రేంవత్..

దీనిపై ఆయన ట్విట్లర్ లో మాట్లాడుతూ.. “భారతదేశంలో బ్రెడ్ ఒక పెద్ద జోక్!” హిమత్‌సింకా అన్నారు. “భారతదేశంలో రెండు రకాల రొట్టెలు (బ్రెడ్లు) ఉన్నాయి. ఒకటి మైదాతో చేసిన వైడ్ బ్రెడ్ (తెల్ల రొట్టె), రెండవ రకం గోధుమ.. మల్టీగ్రెయిన్, హోల్‌వీట్ గత కొన్ని దశాబ్దాలుగా బ్రెడ్ వినియోగం గణనీయంగా పెరిగిందని, ఈ బ్రెడ్ తినడం వల్ల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని హిమత్‌సింకా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

“కొన్ని దశాబ్దాల క్రితం వరకు, బ్రెడ్ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించేవారు కాదు.. కానీ  ఇప్పుడు దీనిని భారతీయులు అల్పాహారం శాండ్‌విచ్‌లు, స్కూల్ టిఫిన్లు, స్నాక్స్ కోసం ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు!” ఫుడ్ ఫార్మా ట్వీట్ చేసింది. “మీ దగ్గర రోజుకు 2 బ్రెడ్ స్లైసులు ఉంటే.. ఒక సంవత్సరంలో 700 కంటే ఎక్కువ స్లైసులు తీసుకుంటారు. తెల్ల రొట్టె మైదా లేదా శుద్ధి చేసిన పిండితో తయారవుతుంది. “మైదా చాలా తక్కువ పోషక విలువలు కలిగి ఉంటుంది. గోదుమల పై ఫైబర్ పొరలను తొలగించిన తర్వాత మైదా తయారవుతుంది. దీనిలో మనకు అవసరమైన పోషకాలు ఉండవు.

Brown bread

“భారతదేశంలో బ్రౌన్ బ్రెడ్ కూడా ఆరోగ్యకరమైనది కాదు..” హిమత్‌సింకా తన వీడియోలో బ్రెడ్ లో గోధుమ రంగును  కృత్రిమ రంగుల ద్వారా ఎలా కలిపారో చూపించారు. అది గోధుమ పిండి కలపడం వల్ల వచ్చే సహజమైన రంగు కాదు.. “కారామెల్ రంగు 150A కారణంగా అవి గోధుమ రంగులో కనిపిస్తాయి. ఈ కృత్రిమ రంగు కోకా కోలా, బోర్న్విటాలోని రంగును పోలి ఉంటుంది.”

మల్టీగ్రెయిన్ బ్రెడ్ (Multigrain Breads)

మూడవ రకం మల్టీగ్రెయిన్ బ్రెడ్..గురించి మాట్లాడుతూ.. ఇది కూడా గోధుమ పిండితో తయారు చేయరని చెప్పారు. “FSSAI ప్రకారం, ఇందులో కలిపిన పదార్థాలు బరువు
ఆధారంగా జాబితా చేయబడ్డాయి. చాలా గోధుమ రొట్టెలు మైదాను మొదటి పదార్ధంగా కలిగి ఉంటాయి, చాలా తక్కువ మొత్తంలో whole wheat ను ఉపయోగిస్తాయి.” ఒక నిర్దిష్ట రకం హోల్ వీట్ బ్రెడ్‌లో 20 శాతం మాత్రమే వోల్ వీట్ ( పూర్తి గోధుమలు) ఉన్నాయని అతను చెప్పారు.

“పలు కంపెనీలు పేరుకు కొద్దిగా గోధుమలను కలిపి అవి పూర్తి గోదుమ బ్రెడ్ (whole wheat bread) ని ప్రకటించుకుంటారు. అని రేవంత్ హిమత్సింకా అన్నారు.
“మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా ఆరోగ్యకరమైనదని కాదు. మల్టీ గ్రెయిన్ అంటే ఒకటి కంటే ఎక్కువ రకం ధాన్యాలు ఉన్నాయని అర్థం. భారతదేశంలోని చాలా మల్టీగ్రెయిన్ బ్రెడ్‌లు కూడా ప్రధానంగా మైదాతో తయారవుతాయి,” అని తెలిపారు.

ప్రత్యామ్నాయం ఏంటీ?

ప్రజలు బ్రెడ్‌కు బదులుగా గోధుమ పిండి చపాతీలనుఎంచుకోవాలని ప్రజలకు సలహా ఇస్తూ, ప్రజలు ఇప్పటికీ ప్రాసెస్ చేసిన రొట్టెలు(బ్రెడ్ లను) తినాలనుకుంటే ముందుగా దాని ప్యాకెట్‌ పై ప్రించ్ చేసిన పదార్థల జాబితాను జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు. మైదా, పామాయిల్, స్థానిక బేకర్ల నుండి లభించే ప్రిజర్వేటివ్‌లను కలిగి ఉన్న రకాలను నివారించాలని రేవంత్ హిమత్సింకా తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version