
కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి
Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. ‘Brain-Eating Amoeba’ గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో తరగతి విద్యార్థి కేరళలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు.
ఆలప్పుజాలోని పూచక్కల్‌కు చెందిన షాలిని, అనిల్‌కుమార్‌ల కుమారుడు బాధితుడు గురుదత్ (15) స్థానిక వాగు వద్ద ఈతకు వెళ్లాడు. అదే సమయంలో మెదడును తినే అమీబా అతడి శరీరంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు.
ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది.అనే అమీబా.. ఏకకణ జీవి. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది. నేగ్లేరియా జాతి మాత్రమే ప్రజలకు సోకుతుంది.. వాటిని నేగ్లేరియా ఫౌలెరి అంటారు.
నేగ్లేరియా ఫౌలెరి మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది మెనింగోఎన్సెఫాలిటిస్ (meningoencephalitis) (PAM) అనే వ్యాధిని కలుగజేస్తుంది. ఇది బాధితుడి మరణానికి దారితీస్తుంది. గతంలో 2017వ సంవత్సరంలో ఇదే అలప్పుజలో ఈ వ్యాధి నమోదైందని మలయాళ మనోరమ ఒక నివేదికలో పేర్కొంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, అమీబాతో కూడిన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు Naegleria fowleri బాధితులకు సోకుతుంది. ప్రజలు ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా సరస్సులు, నదుల వంటి నీటి అడుగున తలలు పెట్టినప్పుడు ఇది సాధారణంగా వ్యాపిస్తుంది. మరో ముఖ్యవిషయమేంటే.. ఇది కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు వ్యాధి బారిన పడరు.
ఈ అమీబా ముక్కు నుండి మెదడుకు చేరుకుంటుంది.. అక్కడ అది మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది.. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అనే ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. PAM ప్రాణాంతకం వ్యాధి.
PAM మొదటి లక్షణాలు
సాధారణంగా సంక్రమణ తర్వాత 5 రోజుల తర్వాత లక్షణాలు ప్రారంభమవుతాయి. కానీ అవి 1 నుండి 12 రోజులలోపు తలనొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు కలిగవచ్చు. తరువాతి లక్షణాలలో మెడ గట్టిపడటం, గందరగోళం, వ్యక్తులకు పరిసరాలపై శ్రద్ధ లేకపోవడం, ఫిట్స్ కోమా వంటివి లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు ప్రారంభమైన తర్వాత, వ్యాధి వేగంగా అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా 5 రోజులలో మరణానికి కారణమవుతుంది. కొంతమంది రోగులు 18 రోజుల వరకు జీవించి ఉండవచ్చని CDC పేర్కొంది.