Saturday, March 1Thank you for visiting

Boat Rockerz 255 Touch Neckband ఫుల్ టచ్ కంట్రోల్స్, 30 గంటల ప్లేబ్యాక్

Spread the love

ధర, ఫీచర్లు ఇవీ..

బోట్ రాకర్జ్ 255 టచ్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ (Boat Rockerz 255 Touch Neckband)  భారతదేశంలో విడుదలైంది. నెక్‌బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ,  టీల్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది పూర్తి టచ్ స్వైప్ నియంత్రణలను కలిగి ఉంది. Dirac Virtuo ద్వారా ఆధారితమైన స్పష్టమైన ఆడియోకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇది 30 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్నిఅందిస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ENx అల్గారిథమ్‌తో ఇది కాల్‌ల సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తొలగిస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో వస్తుంది. నెక్‌బ్యాండ్‌లో 10mm డైనమిక్ గ్రాఫేన్ డ్రైవర్‌లు కూడా ఉన్నాయి.

బోట్ రాకర్జ్ 255 టచ్ నెక్‌బ్యాండ్ ధర

బోట్ రాకర్జ్ 255 టచ్ నెక్‌బ్యాండ్ పరిచయ ధర 1,499.  అయితే రిటైల్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. నెక్‌బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ, టీల్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది అధికారిక బోట్ వెబ్‌సైట్ , Amazon, Flipkart, Myntra వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు .

 స్పెసిఫికేషన్‌లు

బోట్ రాకర్జ్ 255 టచ్ అనేది ఈ కంపెనీ కొత్తగా ప్రారంభించిన అదునాత వైర్‌లెస్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్. ఇది స్మార్ట్ టచ్ కంట్రోల్‌లతో ట్రాక్‌లను మార్చడానికి, వాల్యూమ్‌ను సర్దుబాటు చేయడానికి, మోడ్‌లను మార్చడానికి, కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి అలాగే వాయిస్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయడానికి అనుమతిస్తుంది. నెక్‌బ్యాండ్ డైరాక్ వర్చువో ద్వారా ఆధారితమైన స్పేషియల్ ఆడియోను కలిగి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క ENx అల్గారిథమ్‌తో పనిచేస్తుంది. ఇది బ్లూటూత్ కాల్‌ల సమయంలో నాయిస్ ను తొలగిస్తుంవొ. ఈ నెక్‌బ్యాండ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.

Boat Rockerz 255 Touch Neckband 10mm డైనమిక్ గ్రాఫేన్ డ్రైవర్‌లను కలిగి ఉంది. ఇది ఒక ఛార్జ్‌పై 30 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ డివైజ్ USB-C ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని ఆఫర్ చేస్తుంది. ఇయర్‌ఫోన్‌లు 200mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ఇంకా.. బోట్ రాకర్జ్ 255 టచ్‌లో గేమింగ్ కోసం డెడికేటెడ్ ‘బీస్ట్ మోడ్’ కూడా ఉంది. ఇది 40ఎంఎస్ తక్కువ జాప్యాన్ని అందిస్తుంది. అలాగే మాగ్నెటిక్ పవర్ ఆన్/ఆఫ్, IPX5-రేటెడ్ వాటర్, స్వెట్ రెసిస్టెంట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version