Monday, March 3Thank you for visiting

Bhatti Vikramarka | రైతు రుణ మాఫీ అమలుపై బ్యాంక‌ర్లకు డిప్యూటి సిఎం భట్టి కీలక సూచనలు

Spread the love

Telangana | రైతు రుణమాఫీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల‌క (Bhatti Vikramarka) వ్యాఖ్య‌లు చేశారు. రుణాల మాఫీ వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని అన్నారు. హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని బ్యాంక‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం ఇప్ప‌టి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం వ్యవసాయ రంగం రాష్టాన్రికి వెన్నెముకగా భావిస్తున్న‌ద‌ని తెలిపారు. వ్యవ‌సాయానికి మ‌ద్ద‌తిచ్చేందుకు రుణమాఫీ (Rythu Runamafi ), రైతు భరోసా, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

రూ.36వేల కోట్ల విలువైన  ఎంఓయూలు

ఉచితంగా 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నామని, రెండు లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని చెప్పారు. ఇవి వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయని తెలిపారు. మ‌రోవైపు పారిశ్రామిక రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు మంత్రి భ‌ట్టి చెప్పారు. భట్టి విక్రమార్క. ఇన్నోవేటివ్‌ ‌పాలసీలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ. 36 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారని డిప్యూటీ సీఎం విక్ర‌మార్క‌ వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లను మంత్రి కోరారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నామని చెప్పారు. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడాలని బ్యాంకర్లకు కోరారు.

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్స్ ల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. మొదటి క్వార్టర్‌లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులు ఇప్పటివరకు 40.62? వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం అన్నారు. రాష్ట్రం నగదు నిల్వల నిష్పత్తి మొదటి క్వార్టర్‌లో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశం అని అన్నారు. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్టాల్ల్రో తెలంగాణ ఒకటి అని.. ఇతర రాష్టాల్ర కంటే తెలంగాణ ముందంజలో ఉండేలా తమ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఉపముఖ్యమంత్రి చెప్పారు. వరి ఉత్పత్తిలో పెరుగుదల అంశం.. ఎఫ్‌సీఐకి వరిని సరఫరా చేసే రాష్టాల్ల్రో ప్రధాన రాష్ట్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. రాబోయే తైమ్రాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు.

వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధి చేయండి. 20 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌ ‌లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నాను. మొదటి క్వార్టర్‌ ‌లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటివరకు 40.62శాతం వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం. రాష్ట్రం యొక్క నగదు నిల్వలనిష్పత్తి మొదటి క్వార్టర్లో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశం. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version