Friday, March 14Thank you for visiting

బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర : భగ్నం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్

Spread the love

Bengaluru : బెంగళూరు నగరవ్యాప్తంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) బెంగళూరులో అరెస్టు చేసింది . అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు.
నిందితుల్లో ఒకరికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు.
వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో ఐదుగురి కోసం సీసీబీ కూడా నిఘా పెట్టింది.

అరెస్టయిన ఐదుగురు నిందితులు కూడా 2017లో జరిగిన హత్యకేసులో ప్రమేయం ఉన్నారని పోలీసులు తెలిపారు.

గతంలో వీరంతా బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.. అక్కడ వారు కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడింది. అక్కడే పేలుడు పదార్థాలను ఉపయోగించడంలో శిక్షణ పొందారు. నగరంలో బాంబు పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌పై సీసీబీకి విశ్వనీయ సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశారు.
అనంతరం విలేకరుల సమావేశంలో బెంగళూరు పోలీసులు మాట్లాడుతూ అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరు గతంలో 2017లో జరిగిన హత్య కేసులో 18 నెలల పాటు జైలులో ఉన్నారని తెలిపారు. జైలులో కొందరు నేరగాళ్లతో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద మీడియాతో మాట్లాడుతూ.. వరుస పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నారని వీరికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉందన్నారు. బెంగళూరు నగరంలో విధ్వంసానికి పాల్పడేందుకు ప్లాన్ చేసిన వారిని పట్టుకోవడంలో సీసీబీ విజయం సాధించిందని చెప్పారు.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని.. వారి నుంచి ఏడు పిస్టల్స్, పెద్ద మొత్తంలో లైవ్ బుల్లెట్లు, వాకీటాకీ, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడు విధ్వంసక కార్యకలాపాల కోసం ప్రస్తుతం అరెస్టయినవారికి ఈ ఆయుధాలను అందించారని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version