Wednesday, April 23Welcome to Vandebhaarath

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ ‌లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..

Spread the love

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI)  విడుదల చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర‌య్యే ఛాన్స్ ఉం‌ది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్‌, ‌ధన్‌తేరాస్‌, ‌దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. ఆదివారాల్లో కలిపి 12 రోజులు బ్యాంకులకు సెలవులు పడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే విషయం తెలిసిందే. అయితే, ఇంతకీ బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో సెలవులు జాబితా ప‌రిశీలించండి.

Bank Holidays in october 2024

  • అక్టోబర్‌ 2‌న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్‌ 3‌న నవరాత్రి వేడుకలు ప్రారంభం.
  • మహారాజా అగ్రసేన్‌ ‌జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు
  • అక్టోబర్‌ 6‌న ఆదివారం బ్యాంకుల మూసివేత.
  • అక్టోబర్‌ 10 ‌మహా సప్తమి
  • అక్టోబర్‌ 11‌న మహానవమి
  • అక్టోబర్‌ 12‌న దసరా, రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.
  • అక్టోబర్‌ 13‌న ఆదివారం
  • అక్టోబర్‌ 17‌న కటి బిహు (అసోం), వాల్మీకి జయంతి కారణంగా బ్యాంకులకు హాలీడే.
  • అక్టోబర్‌ 20‌న ఆదివారం
  • అక్టోబర్‌ 26‌న విలీన దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో, నాల్గో శనివారం కారణంగా హాలీడే.
  • అక్టోబర్‌ 27‌న ఆదివారం
  • అక్టోబర్‌ 31‌న దీపావళి, సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌సందర్భంగా సెలవు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version