
Bahraich violence | బహ్రైచ్‌లోని జిల్లా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) అధికారులు శుక్రవారం బహ్రైచ్‌లో హింసను ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది ఇళ్లపై నోటీసులు అతికించారు. మూడు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని, లేకుంటే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
నివేదికల ప్రకారం.. 24 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రా హత్యకు కారణమై హింసాకాండకు పాల్పడిన ఐదుగురిలో ఒకరైన అబ్దుల్ హమీద్‌తో సహా 23 మందిపై బుల్డోజర్ చర్యను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని ప్రధాన జిల్లా రహదారిపై శాఖ అనుమతి లేకుండా రహదారి మధ్య సెంటర్ పాయింట్ నుంచి 60 అడుగుల దూరం లోపు ఏదైనా నిర్మాణ పనులు చేస్తే అది అక్రమ నిర్మాణాల కేటగిరీ కిందకు వస్తుందని అధికారులు తెలిపారు.
“బహ్రైచ్ (Bahraich ) జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో లేదా ముందస్తు డిపార్ట్‌మెంటల్ అనుమతితో నిర్మాణ పనులు జరిగితే, వెంటనే దాని అసలు కాపీని అందించాలి. లేకుంటే మూడు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని మీరే తొలగించండి. లేని పక్షంలో పోలీసులు, జిల్లా యంత్రాంగం సహాయంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని నోటీసులో పేర్కొన్నారు.
మొత్తం ఐదుగురు నిందితులు-అబ్దుల్ హమీద్, మహ్మద్ అఫ్జల్, మహ్మద్ ఫహీమ్, మహ్మద్ సర్ఫరాజ్, మహ్మద్ తలీమ్‌లను గురువారం అరెస్టు చేశారు. తొలుత ముగ్గురిని అరెస్టు చేయగా, జిల్లాలోని నాన్‌పరా ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సర్ఫరాజ్, తలీమ్‌లకు కాలుకు బుల్లెట్ గాయాలు తగిలాయి. మహసీ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) హేమంత్ కుమార్ యాదవ్ 23 ఇళ్లపై నోటీసులు అతికించారని ధృవీకరించారు. ఎలాంటి అవాంఛనీయసంఘటనలు చోటు చేసుకోకుండా ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాల్లో నివాసముంటున్న వారిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారులు సిద్ధం కావాలని కోరారు.
ఆక్రమణదారులకు మూడు రోజుల గడువు ఇచ్చామని, సూచనల మేరకు ఆదివారం లేదా సోమవారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా ప్రభుత్వ చర్యను సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఖండించాయి.
కాగా దుర్గాపూజ విగ్రహ నిమజ్జనం సందర్భంగా రామ్‌గోపాల్ మిశ్రాను కాల్చిచంపడంతో పాటు నలుగురు వ్యక్తులు గాయపడిన సంఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి వరకు బహ్రైచ్ జిల్లాలో ఉద్రిక్తత, హింస చోటుచేసుకుంది. మొత్తం ఐదుగురు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌పై జైలుకు పంపారు . ఈ నోటీసులతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.