
Ayushman Bharat scheme | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. “70 ఏళ్లు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా AB PM-JAY ప్రయోజనాలను పొందేందుకు అర్హులు” అని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ ఉచిత ఆరోగ్య బీమాను ఎలా పొందాలి?
- 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సంరక్షణ కవరేజీ కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ప్రత్యేకమైన కార్డును అందుకుంటారు.
- ఇప్పటికే AB PM-JAY కింద కవర్ చేయబడిన వారు వారి కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేకంగా సంవత్సరానికి ₹ 5 లక్షల అదనపు టాప్-అప్ పొందవచ్చు.
- ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ల నుంచి ఇప్పటికే ప్రయోజనం పొందుతున్న సీనియర్ సిటిజన్‌లు వారి ప్రస్తుత ప్లాన్‌తో కొనసాగవచ్చు లేదా AB PM-JAY కింద కవరేజీని ఎంచుకోవచ్చు.
ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి?
Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అని ప్రకటన పేర్కొంది. ఇది ఆసుపత్రిలో చేరిన వారికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తుంది . కుటుంబ సభ్యుల వయస్సుతో సంబంధం లేకుండా 12.34 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటివరకు, ఈ ఆరోగ్య పథకం ద్వారా ప్రజలు ₹ 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ ప్రయోజనం పొందారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..