
Ayodhya Ram Mandir Pratishtha Dwadashi 2025 | అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించిన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 11, 2025న ‘ప్రతిష్ఠ ద్వాదశి’గా జరుపుకుంటామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ‘ప్రతిష్ఠ ద్వాదశి’కి అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ప్రతిష్ఠ ద్వాదశి (Pratishtha Dwadashi)’ నాడు కార్యక్రమాల జాబితా ఇదీ..
- రామ్ మందిర్ ప్రాంగణంలో, యజ్ఞ మండపం నిర్వహించనున్నారు. ఇందులో శుక్ల యజుర్వేద మంత్రాలతో అగ్నిహోత్రం (ఉదయం 8-11నుంచి మధ్యాహ్నం 2-5), 6 లక్షల రామ మంత్ర పారాయణాలు, రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణాలు ఉంటాయి.
- ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో జనవరి 11న రాగసేవ (మధ్యాహ్నం 3-5గం), బధై గాన్ (సాయంత్రం 3-5గం) నిర్వహిస్తారు.
- యాత్రి సువిధ కేంద్రం మొదటి అంతస్తులో రామచరితమానస్ సంగీత పఠనం జరుగుతుంది.
- కార్యక్రమం చివరి భాగం అంగద్ టీలాలో ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 గంటల వరకు రామ కథ కార్యక్రమం జరుగుతుంది. తరువాత 3:30 నుంచి 5 గంటల వరకు రామచరితమానస్‌పై ఉపన్యాసాలు ఉంటాయి. సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..