Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మహర్దశ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..
Amrut Bharat Station Scheme | కేంద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపిక చేసింది. ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి, కాగా,
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు 2024-25 సంవత్సరానికి రూ.9,151 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) మొత్తం విలువ రూ. 73,743 కోట్లు అని వివరించారు. భద్రతను పెంచేందుకు 743 RoBలు, RuBలను నిర్మించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఏపీ లోని మొత్తం 73 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
స్టేషన్ల వివరాలు
తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం, గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు ...