Saturday, March 15Thank you for visiting

Andhrapradesh

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు

Andhrapradesh
Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల (National Highway Projects) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6,585 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. ఏడు జాతీయ రహదారుల‌ ప్రాజెక్టులు ఈ  విధంగా ఉన్నాయి. కోడుమూరు-పేరిచెర్ల, సంగమేశ్వరం-నల్లకాలువ నంద్యాల-కర్నూలు, వేంపల్లి-చాగలమర్రి, గోరంట్ల-హిందూపూర్, ముద్దనూరు-బి కొత్తపల్లి, పెందుర్తి-బవర్ధ మధ్య ఉన్నాయి. National Highway Projects in Andhra Pardesh ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఇతరులతో సమన్వయం చేసుకుని ఈ నిధుల సేకరణపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని జ‌నార్ద‌న్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గతంలో భారత్ మాల ప్రాజెక్ట...

జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Andhrapradesh
Sanatana Dharma Rakshana Board | తిరుమ‌ల‌ లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల‌ కొవ్వును వినియోగించార‌నే వార్త‌లపై దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం త‌క్ష‌ణ‌మే సనాతన ధర్మ రక్షణ బోర్డు  ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “తిరుపల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపారని గుర్తించ‌డంతో మేమంతా చాలా షాక్ కు గుర‌య్యాం. ” దిగ్భ్రాంతికరమైన నేరానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాల‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో బాధ్యులైన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు....

Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..

Andhrapradesh
Tirumala Laddu Controversy | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం.. తిరుమల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావ‌న క‌లుగుతుంది. అందులో తిరుమ‌ల లడ్డూ అనగానే అంద‌రికీ ఎంతో ప‌విత్ర‌మైన‌దిగా, ప్ర‌తీక‌ర‌మైన‌దిగా భావిస్తారు. అద్భుత‌మైన రుచికి ఈ లడ్డూకు ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. అయితే ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉప‌యోగించార‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సంచ‌ల‌నం గా మారింది. ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా దుమారం రేపుతోంది. చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్నిత‌ప్పుబ‌ట్టారు. విషప్రచారం చేస్తే స్వామి...

Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు టైమింగ్స్‌, హాల్టింగ్ స్టేష‌న్లు…

Andhrapradesh
Durg to Visakhapatnam Vande Bharat | ఏపీ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌యాణించేవారికి శుభ‌వార్త‌.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దుర్గ్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఇకపై రాజధాని రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వరకు 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణికులు కేవలం 5 గంటల్లోనే చేరుకోనున్నారు. ఇందుకోసం రైల్వే బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఇది డిసెంబర్ 2022 నుండి శనివారాలు మినహా వారానికి ఆరు రోజులు బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ మధ్య ఈ రైలు సేవ‌లందిస్తోంది. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు మార్గం బిలాస్‌పూర్-నాగ్‌పూర్ వందేభారత్ తర్వాత మ‌రో రెండో రైలును కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. సెప్టెంబర్ 15 న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప‌లు ...

AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

Andhrapradesh
AP Floods | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర‌రూపం దాల్చుతోంది. దీని కార‌ణంగా సోమవారం నాటికి ఒడిసా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం (సెప్టెంబర్ 8) రోజున ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు (AP Floods) కురిసే చాన్స్ ఉంద‌ని రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన బులెటిన్‌లో తెలిపింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. తూర్పుగోదావర...

Tirupati Laddu | హైదరాబాద్‌లో ప్ర‌తిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు

Andhrapradesh
Tirupati Laddu | హైదరాబాద్‌: వేంక‌టేశ్వ‌ర‌స్వామి భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి వేద స్థానం (TTD) తీపిక‌బురు చెప్పింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ (Tirupati Laddu ) విక్రయించగా ఇక‌పై ప్ర‌తీరోజు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించారు. ఈ లడ్డూ ప్రసాదం ఇకపై ప్ర‌తిరోజూ అందుబాటులో ఉంటుందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఇన్ స్పెక్ట‌ర్ శ్రీనివాస్ ప్రభు, ఎన్.నిరంజన్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామివారి లడ్డూ విక్ర‌యాల్లో లో తితిదే కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పవిత్రమైన లడ్డూ ప్రసాదం (రూ.50కి ఒక లడ్డూ) ఇక నుంచి ప్ర‌తీరోజూ అందజేయాలని నిర్ణ‌యించారు.రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్ ఆలయాల్లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతున్నారు. తి...

TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

Andhrapradesh, Telangana
TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించాల‌నే ఉద్దేశంతో కొన్ని హైఎండ్ సర్వీసులపై రాయితీలు (TGSRTC Discount) కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రాయితీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గంలో వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలనుకుంటే, విజయవాడ వరకు టిక్కెట్‌పై 10 శ...

New Railway Line | ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త రైల్వే లైన్ పనులపై అధ్యయనం..

Andhrapradesh
New Railway Line Works in Andhra | విజయవాడ: మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు కొత్త రైలు మార్గ నిర్మాణాన్ని పరిశీలించేందుకు మచిలీపట్నం జేఎస్పీ ఎంపీ వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తి మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. రైల్వే లైన్‌ను నిర్మించాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ బాలశౌరి సమగ్ర లేఖను సమర్పించారు. ఈ లైన్ కోసం చాలా కాలంగా డిమాండ్ ఉందని, దీని ఏర్పాటుతో దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై  గతంలో కేంద్ర రైల్వేశాఖ  మంత్రి అశ్విని కి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఇప్పుడు ప్రతిపాదిత రైల్వే లైన్‌పై అధ్యయనం చేయనున్నట్లు బాలశౌరీకి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కొత్త రైల్వే లైన్‌ నిర్మాణాన్ని వివరంగా పరిశీలించాల్సిందిగా సంబంధిత డైరెక్టరేట్‌ని కోరాం’’ అని ఎంపీకి కేంద్ర మంత్రి బదులిచ్చారు. కొత్త రై...

SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగింపు ..వివ‌రాలు ఇవే..

Andhrapradesh, Telangana
SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే తీపి క‌బురు చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మ‌రికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్ల‌డించింది. అక్టోబరు నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు య‌థావిథిగా న‌డిపించ‌నున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ పండుల్లో ప్ర‌యాణికుల‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్ర‌త్యేక‌ రైళ్లను పొడిగిస్తున్నట్లు వివ‌రించింది. పొడిగించిన ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది. పొడిగించిన రైళ్లలో ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే సుదూర‌ రైళ్లు ఉన్నాయి. కింది రైళ్లు డిసెంబ‌ర్ వ‌ర‌కు న‌డుస్తాయి. సికింద్రాబాద్‌-రామనాథపురం (07695), రామనాథపురం-సికింద్రాబాద్‌ (07696), కాచిగూడ – మధురై (07191), మధురై – కా...

Ration card Holders| పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డుపై చక్కర పంపిణీ

Andhrapradesh
Ration card Holders | రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంతోనే రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం నిత్యవసరాలను తగ్గించి చివరకు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అందరికి అవసరమైన కందిపప్పును పూర్తిగా నిలిపివేసింది. మూడునెలల కిందట అదికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కార్డుదారులకు సరకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండీయూ వాహనదారులతో సర్వే నిర్వహించింది.  కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, నగదుకు అరకిలో చక్కెర ఇవ్వనున్నారు. వచ్చేనెల నుంచి కొత్త...
Exit mobile version