
Amrit bharat station scheme : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గంలో కీలకమైన ఖమ్మం రైల్వే స్టేషన్ (Khammam railway station ) రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. రైలు ప్రయాణికులకు మెరుగైన అత్యాధునిక సౌకర్యాలు అందించడానికి భారతీయ రైల్వే భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు చేపడుతున్న విషయం తెలిసిందే.. అమృత్ భారత్ స్టేషన్ స్కీం (ABSS) లో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్‌లను రూ.2,737 కోట్ల అంచనా వ్యయంతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కల్పిస్తూ పునరాభివృద్ది చేపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2023, ఫిబ్రవరి 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి ప్రమాణాలు, హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట, నాంపల్లి, మల్కాజిగిరి, కాజీపేట, వరంగల్, రామగుండం, పెద్దపల్లి, వంటి స్టేషన్లలో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక ఖమ్మం రైల్వే స్టేషన్ సుమారు రూ.25.41 కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి.
#Khammam Railway Station to be Redeveloped with an Expenditure of Rs. 25.41 Crores under #AmritBharatStationScheme
Works progressing at fast pace to provide enhanced comfort and convenience to rail users @RailMinIndia @drmsecunderabad pic.twitter.com/rbbITbIfRO— South Central Railway (@SCRailwayIndia) March 13, 2025
Khammam railway station సరుకు రవాణాకు కీలకం
ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పురాతనమైనది. 19వ శతాబ్దంలో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (ఎన్.జి.ఎస్.ఆర్) ప్రాజెక్టులో భాగంగా స్థాపించారు. ఇది హైదరాబాద్‌ను విజయవాడతో అనుసంధాన్నిస్తుంది. బ్రిటిష్ కాలంలో సమీపంలోని గనుల నుంచి బొగ్గు, సున్నపురాయి, ఇతర ఖనిజాలను రవాణా చేయడానికి ఖమ్మంలో రైల్వేస్టేషను ఏర్పాటు చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ – చెన్నై, హైదరాబాద్ – విజయవాడ రైల్వే లైన్ల లో కీలకంగా మారింది. ఈ స్టేషన్ సమీపంలోనున్న సింగరేణి కాలరీలు ఉండడం వలన బొగ్గుకు ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తోంది. సిమెంట్, ఉక్కు, కాగితపు పరిశ్రమలు వంటి అనేక పరిశ్రమలతో స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గణనీయంగా దోహద పడుతుంది.
ఖమ్మం రైల్వేస్టేషన్ కీలకాంశాలు
- ఖమ్మం రైల్వే స్టేషన్ నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3) కేటగిరి కిందికి వస్తుంది.
- సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట—విజయవాడ సెక్షన్‌లో నున్న ఈ స్టేషన్ తో రూ 29.64 కోట్ల వార్షిక ఆదాయం వస్తుంది. సగటున రోజుకు 12,988 మంది ప్రయాణీకుల రాకపోకలు సాగిస్తుంటారు.
- ఖమ్మం స్టేషన్‌లో సుమారు 83 రైళ్లు ఆగుతాయి.
- ఈ స్టేషన్ ముఖ్యమైన సూపర్‌ఫాస్ట్ రైళ్లకు న్యూదిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి వంటి అనేక గమ్యస్థానాలకు వెళ్లే సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఖమ్మంలో హాల్టింగ్ సౌకర్యం ఉంది.
Amrit bharat station scheme : ఏయే అభివృద్ధి పనులు చేస్తున్నారు..?
- రైల్వే స్టేషన్ భవనం ముఖద్వారం, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం
ప్రయాణీకుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదాచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం - 2 లిఫ్టులు & 2 ఎస్కలేటర్ల ఏర్పాటు.
- ప్లాట్‌ఫామ్ ఫ్లోరింగ్ అభివృద్ధి
- టాయిలెట్లకు మెరుగుదలలు, దివ్యాంగులకు కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మాణం.
- వెయిటింగ్ హాల్ అభివృద్ధి
- స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ప్రయాణికుల రాకపోకలకు అనువుగా స్టేషన్ ప్రాంగణం మెరుగుదల
- స్టేషన్ ప్రాంతాలలో రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా పేయింటింగ్స్
- ప్రయాణీకులకు స్పష్టంగా కనిపించేలా సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.