Saturday, April 19Welcome to Vandebhaarath

Allu Arjun Pushpa 2 | అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 ఆన్ లైన్‌లో లీక్..!

Spread the love

Pushpa 2  | ఈ సంవత్సరం విడుద‌లైన అతిపెద్ద చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5, 2024 గురువారం థియేటర్లలోకి వ‌చ్చింది. అయితే, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇది చాలా పైరసీ వెబ్‌సైట్‌లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చింది. లీక్ అయిన సినిమా HD వెర్షన్‌లు కూడా ఉన్నాయి, ఇవి 240p నుంచి హై డెఫినిష‌న్‌ 1080p వరకు రిజల్యూషన్‌లలో అందుబాటులో ఉన్నాయి.

ఈ లీక్ బాక్సాఫీస్ పనితీరుకు తీవ్రమైన ముప్పుగా మారడంతో చిత్ర నిర్మాతలు, చిత్ర అభిమానులలో ఆందోళన మొదలైంది.ఈ పైరసీ భూతం చలనచిత్ర పరిశ్రమకు పెను స‌వాల్ గా మారింది. ఆన్‌లైన్‌లో పైరేటెడ్ వెర్షన్‌ల లభ్యతతో, చాలా మంది వీక్షకులు టిక్కెట్‌ను కొనుగోలు చేయకుండా చట్టవిరుద్ధంగా సినిమాను చూస్తున్నారు. దీంతో ఇది సినిమా విజ‌యం, వ‌సూళ్ల‌కు భారీగా గండి ప‌డుతోంది .

‘పుష్ప 2’ లీక్

‘పుష్ప 2’ ఇటీవల టిక్కెట్ ధరలను పెంచడంతో ఇప్పటికే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సినిమా టిక్కెట్ ధరలు ఏ సౌత్ సినిమాలోనూ ఎన్నడూ లేని విధంగా వివాదానికి దారితీశాయి. సినిమా స్టార్ అల్లు అర్జున్‌తో సహా కొంతమంది ధరల పెంపును సమర్థించగా, స్థానిక సినీ ప్రేక్షకులు పెరిగిన ఖర్చులపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతుందా?

ఆన్‌లైన్ లీక్‌లు సినిమా వసూళ్లపై ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది, ముఖ్యంగా దాని ధర భారీగా పెరిగిన తర్వాత. ఈ మూవీ పైరేటెడ్ కాపీల కార‌ణంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య‌త‌గ్గిపోతుంద‌ని ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ ధరలకు టిక్కెట్లు కొని సినిమా చూసేందుకు బ‌దులుగా కాపీ కంటెంట్ చూసే ప్ర‌మాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పైరసీ సినిమాలను ప్రభావితం చేయడంతో, ‘పుష్ప 2’ నిర్మాతలు, అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అక్రమ డౌన్‌లోడ్‌పై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version