Thursday, March 13Thank you for visiting

Indore | కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. నామినేషన్‌ ఉపసంహరించుకున్న ఇండోర్‌ అభ్యర్థి..

Spread the love

Indore | లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి (Congress) వరుసగా గట్టి షాక్ లు తగులుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లోక్ సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బాబ్‌ (Akshay Kanti Bamb) తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా ఆయన బీజేపీలో చేరిపోయారు.  ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తూ మంత్రి విజయ్‌ వర్గియ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇండోర్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతిని బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నట్లుఆయన పేర్కొన్నారు. అక్షయ్‌ తనతో ఉన్న ఫొటోను  ట్యాగ్‌ చేశారు. కాగా ఇండోర్ లో నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న ఓటింగ్ జరగనుంది. సోమవారంమే నామినేషన్ల చివరి రోజు.

కాగా కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ సహా ముగ్గురు అభ్యర్థులు ఈ రోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ విలేకరులతో అన్నారు. అక్షయ్ బామ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు, అతని పక్కన బిజెపి ఎమ్మెల్యే రమేష్ మెండోలా ఉన్నారు.

ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు

మధ్యప్రదేశ్‌లో అత్యధిక ఓటర్లు ఉన్న ఇండోర్‌(Indore)లో ప్రస్తుత బిజెపి ఎంపి శంకర్ లాల్వానీపై కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ బామ్ (45)ని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా పలువురు పార్టీ కార్యకర్తలు మధ్యప్రదేశ్‌లో బీజేపీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపిక చేసింది.

ఇదిలా ఉండగా గత వారం గుజరాత్‌లోని సూరత్‌లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని కోల్పోయింది, ఇందులో కాంగ్రెస్ అభ్యర్థిపై అనర్హత వేటుపడగా, ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఏప్రిల్ 22న, సూరత్ లోక్‌సభ నియోజకవర్గానికి బిజెపికి చెందిన ముఖేష్ దలాల్ ఏకపక్షంగా గెలిచినట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌కు రెండోసారి ఎదురుదెబ్బ తగలడంతో, ఇండోర్‌లోని పార్టీ స్థానిక నాయకులు డీలాపడిపోయారు. అక్షయ్ బామ్ ఎంపిక విషయంలో పార్టీ నాయకత్వ నిర్ణయంపై గరం అవుతున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version