Tuesday, March 4Thank you for visiting

ఒక్క సంవత్సరంలోనే 18 సినిమాలు రిలీజ్.. విజయ కాంత్ కు కెప్టెన్ పేరు ఎలా వచ్చిందంటే..?

Spread the love

Vijaykanth | చెన్నై : త‌మిళ న‌టుడు విజ‌య‌కాంత్ త‌న సినీ ప్రస్థానంలో ‌లో త‌మిళ చిత్రాలే త‌ప్ప ఇత‌ర భాష‌ల్లో న‌టించ‌లేదు. అయితే ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగు, హిందీలో డ‌బ్ అయి ఘన విజ‌యాలు సాధించాయి. ‘ఇనిక్కుం ఇలామై’తో న‌టుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విజ‌యకాంత్. సుమారు 150కి పైగా చిత్రాల్లో న‌టించిన ఆయన 27 ఏళ్ల వ‌య‌సులో తెరంగ్రేటం చేశారు. 2015 వ‌ర‌కు సినిమాల్లో న‌టించారు. కాగా 1984 సంవత్సరంలో ఆయ‌న న‌టించిన 18 సినిమాలు విడుద‌ల కావ‌డం విశేషం.. విజయ్ కాంత్ 20కి పైగా పోలీసు క‌థ‌ల్లోనే న‌టించి అభిమానులను మెప్పించారు. విజ‌య‌కాంత్ పలు చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం కూడా చేశారు. ఆయన స్వీయలో న‌టించిన చిత్రం విరుధ‌గిరి. వ‌ల్లార‌సు, న‌ర‌సింహ‌, స‌గ‌ప్తం చిత్రాల‌ను నిర్మించారు. కాగా విజ‌యకాంత్ చివరిసారి నటించిన చిత్రం స‌గ‌ప్తం(2015).

Vijaykanth కు కెప్టెన్ పేరు ఎలా..?

‘కెప్టెన్ ప్ర‌భాక‌ర‌న్’ అనే చిత్రం ద్వారా విజ‌య‌కాంత్‌కు కెప్టెన్ అని పేరుపెట్టారు. ఈ సినిమా 1992లో విడుద‌ల కాగా, తమిళంతోపాటు తెలుగు ఇతర భాషల్లో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మరో విశేషమేంటంటే.. కెప్టెన్ ప్ర‌భాక‌ర‌న్ చిత్రం విజ‌య‌కాంత్‌ 100వ చిత్రం.. కెప్టెన్ ప్ర‌భాక‌ర‌న్ విజ‌యం త‌ర్వాత ఆయ‌న‌ను కెప్టెన్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు.. కెప్టెన్ ప్రభాకరన్ చిత్రానికి ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించారు.
విజయ్ కాంత్, ఆర్కే సెల్వమణిది తమిళ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్. సెల్వమణి దర్శకుడిగా మొట్టమొదటి సినిమా ‘పూలన్ విసారణై’లో విజయకాంత్ హీరో. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి ‘కెప్టెన్ ప్రభాకరన్’ సినిమా చేశారు. దాని తర్వాత నుంచి విజయకాంత్ (Vijayakanth)ను అందరూ ‘కెప్టెన్ విజయకాంత్’ అని పిలుచుకుంటున్నారు. అంతకుముందు ఆయనను ‘పురట్చి కలైంజర్’ (విప్లవ కళాకారుడు) అని అభిమానంతో పిలిచేవారు.

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

What is Vijayakanth famous for?: కథానాయకుడిగా 5 దశాబ్దాల ప్రయాణంలో విజయకాంత్ కేవలం తమిళ సినిమాలు మాత్రమే చేయడం గమనార్హం. ఆయన సినిమాలు తెలుగు, హిందీ భాషల్లో అనువాదమయ్యాయి. ఎక్కువగా పోలీస్, దేశభక్తి కథలతో వచ్చిన సినిమాలు చేయడంతో ఆయనను విప్లవ చిత్రాల కథానాయకుడిగా, విప్లవకళాకారుడిగా ప్రేక్షకులు చూసేవారు..

విలన్ టు  హీరో !

Who Introduced Vijaykanth: ‘ఇనిక్కుమ్ ఇలమై’తో విజయకాంత్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయన విలన్ గా మెప్పించారు. అప్పుడు విజయ్ కాంత్ వయసు 27 ఏళ్లు. ఆ తర్వాత హీరోగా నటించారు. కెరీర్ ప్రారంభంలో తొలుత పరాజయమైనప్పటికీ ప్రస్తుతం తమిళనాడులో స్టార్ హీరో.. దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’ సినిమాలతో ఘన విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

విజయకాంత్ వారసులు ఎందరు..

Vijaykanth family details : విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును ‘విజయకాంత్’గా మార్చుకున్నారు.. ఆయనకు జనవరి 31, 1990 లో వివాహం జరిగింది. ఆయన భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
విజయకాంత్ నటించిన ఆఖరి సినిమా ‘సప్తగం’. అందులో విజయ్ కాంత్ అతిథి పాత్రలో మెరిశారు. ఆ సినిమాతో కుమారుడు షణ్ముగపాండియన్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాకు విజయకాంత్, ఆయన బావ కె.ఎల్. సుధీశ నిర్మాతలు.. ఆ తర్వాత షణ్ముగ పాండియన్ ‘మధుర వీరన్’ అని మరో సినిమా కూడా­ చేశారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version