
Actor Vijay | చెన్నై: వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య తమిళ అగ్ర నటుడు.. తన పార్టీ తమిళగ వెట్రి కళగం తొలి మహానాడులో పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టాడు.. ”నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో నేను భయపడడం లేదుసస అంటూ నటుడు విజయ్ (Vijay) వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని అన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.
పార్టీ గీతం వినిపిస్తుండగా ప్రత్యేకంగా నిర్మించిన ర్యాంప్‌పై నడిచిన ఆయన 100 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై పార్టీ జెండాను లాంఛనంగా ఎగురవేశారు. గంటల కొద్దీ నిరీక్షణ తరువాత విజయ్ అద్భుతమైన తీరిలో మాట్లాడారు. తన ప్రారంభ ప్రసంగంలో విజయ్ ఇలా అన్నాడు, “రాజకీయాల్లో నేను బేబీనే కానీ దేనికి భయపడను. సినిమాతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ ఫీల్డ్. అని అన్నారు.
“అందరూ సమానమే, కార్యకర్తలు, నేతల మధ్య ఎటువంటి తేడా ఉండదు” అని ప్రకటించాడు, అందరినీ కలుపుకొని అందరికీ అనువైన రాజకీయ వాతావరణాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానని తెలిపారు.
పెరియార్, కామరాజ్, అంబేద్కర్, అంజలై అమ్మాళ్, వేలు నాచియార్ వంటి వ్యక్తులను తన మార్గదర్శకులని విజయ్ అన్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందిన తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభించి పార్టీ చిహ్నమైన వీర వాల్‌ను బహూకరించారు.
టీవీకే పార్టీ సమావేశంలో విజయ్ తన ప్రసంగంలో పలు కీలక విధానాలను వివరించారు. ప్రభుత్వ అధికార భాషగా తమిళాన్ని ఉపయోగిస్తామని ప్రకటించారు. మదురైలో సెక్రటేరియట్ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. విద్యను రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో చేర్చాలని వాదించారు. అదనంగా, రాష్ట్ర స్వయంప్రతిపత్తిని రక్షించడానికి గవర్నర్ పదవిని తొలగించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అధికారుల్లో లంచాలను తొలగించడం ద్వారా అవినీతి రహిత పరిపాలనను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన శిక్షలను అమలు చేస్తానని, జవాబుదారీ పాలన కోసం దృష్టి పెడతానని ప్రతిజ్ఞ చేశారు.
కాగా ఈవెంట్‌కు హాజరైన వంద మందికి పైగా డీహైడ్రేషన్ కారణంగా స్పృహతప్పి పడిపోయారు, సహాయం అందించడానికి సైట్‌లో 35 మందికి పైగా వైద్యులు ఉన్నారు. సాయంత్రం సమావేశం ప్రారంభం కాగా, ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..