
Aadhaar card free online update | ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మిలియన్ల కొద్దీ ఆధార్ దారులకు ఊరట కలిగిస్తూ ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ ఉచిత సేవ కోసం గడువు మొదటగా జూన్ 14, 2024 వరకు విధించగా, ఆ తరువాత సెప్టెంబరు 14, 2024 వరకు పొడిగంచింది. ఇక తాజాగా మరోసారి ఎక్స్‌టెండ్ చేస్తూ అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి డిసెంబర్ 14, 2024 వరకు తుది గడువు విధించింది.
“#UIDAl ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని 14 జూన్ 2025 వరకు పొడిగించింది; లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉచిత సేవ #myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. #ఆధార్‌లో తాజా ధ్రవీకరణ పత్రాలను అప్‌డేట్ చేయాలని UIDL ” అని ఒక ట్వీట్‌లో పేర్కొంది. అసలు గడువు డిసెంబర్ 14 నుంచి పొడిగించిన తర్వాత, తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలనుకునేవారు ఇప్పుడు జూన్ 14 వరకు వెసులుబాటు కలిగింది.
free Aadhaar online update : మీ ఆధార్ ను ఎలా అప్‌డేట్ చేయాలి?
: ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి దశలు
- UIDAI సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి: అధికారిక UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- లాగిన్ చేయండి: మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయండి.
- డాక్యుమెంట్ అప్‌డేట్‌కి నావిగేట్ చేయండి: ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ విభాగానికి వెళ్లి, ఇప్పటికే ఉన్న మీ వివరాలను ధ్రువీకరించండి.
- ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయండి: డ్రాప్-డౌన్ మెను నుంచి తగిన డాక్యుమెంట్ టైప్‌ను ఎంచుకోండి ధృవీకరణ కోసం మీ సపోర్టింగ్ డాక్యుమెంట్‌ల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.
- సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌ను గమనించండి: మీ ఆధార్ అప్‌డేట్ స్టేటస్‌ని ట్రాక్ చేయడం కోసం సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌ను సేవ్ చేసినట్లు నిర్ధారించుకోండి.
బయోమెట్రిక్ మార్పుల కోసం ఆఫ్‌లైన్ అప్‌డేట్‌లు
- వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు లేదా ఫోటోగ్రాఫ్‌లు వంటి బయోమెట్రిక్ సమాచారానికి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం, మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి.
- అప్‌డేట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి: UIDAI వెబ్‌సైట్ నుంచి ఫారమ్‌ను ప్రింట్‌చేసుకోండి.
- ఫారమ్‌ను పూరించిన తర్వాత అవసరమైన పత్రాలతో జతచేసి సమీప ఆధార్ కేంద్రంలో సమర్పించండి.
- బయోమెట్రిక్ ధృవీకరణ కోసం బయోమెట్రిక్ డేటా (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు మొదలైనవి) అందించండి.
- మీ అప్‌డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి మీకు మీ URN (అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్)తో కూడిన స్లిప్ ఇస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..