Chaava : ప్రభంజనం సృష్టిస్తున్న చావా.. ఈ సినిమాకు తొలి రోజు నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. 

తొలి రోజు ఈ మూవీ రూ.32.5 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందివీకెండ్లో అదరగొట్టిన ఈ చిత్రం.. వీక్ డేస్‌లో కూడా అదే స్థాయిలో ఆక్యుపెన్సీలతో

 ఈ చిత్రానికి ఆరో రోజు రూ.32 కోట్ల వసూళ్లు రావడం విశేషం.దాదాపు తొలి రోజుతో సమానంగా వసూళ్లు రావడమంటే.. షాకింగే..  

  కనీసం నెల రోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోందని చెబుతున్నారు.  ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.400 కోట్ల మార్కును దాటే అవకాశముంది.

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించాడు. ఈ మూవీని మ్యాడ్ రాక్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది

తన నటనతో శంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.