
Amaravati : దేశవ్యాప్తంగా దుమారం రేపిన వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ (Tirupati laddu Issue ) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భక్తులకు ప్రసాదంగా అందించే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను కల్తీ చేశారనే ఆరోపణలతో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజు రాజశేఖరన్‌లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. సిట్ దర్యాప్తులో నెయ్యి సరఫరాలో ప్రతి దశలోనూ నిబంధనలను పూర్తిగా అతిక్రమించినట్లు వెల్లడైందని, దీంతో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
వైష్ణవి డెయిరీ అధికారులు ఆలయానికి నెయ్యి సరఫరా చేయడానికి ఏఆర్ డెయిరీ పేరుతో టెండర్లను పొందారని, టెండర్ ప్రక్రియను తారుమారు చేయడానికి నకిలీ రికార్డులను సృష్టించారని తెలిపారు.
వైష్ణవి డెయిరీ భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యిని సేకరించినట్లు తప్పుగా చెప్పిందని సిట్ బయటపెట్టింది, అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యం వైష్ణవి డెయిరీకి లేదని అధికారులు గమనించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వాడారనే ఆరోపణలను దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ (CBI) గత ఏడాది నవంబర్‌లో ఐదుగురు సభ్యుల సిట్‌ను ఏర్పాటు చేసింది .
ఈ బృందంలో కేంద్ర సంస్థకు చెందిన ఇద్దరు అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చెందిన ఇద్దరు అధికారులు , భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ( FSSAI ) నుంచి ఒకరు ఉన్నారని వారు తెలిపారు.
బిజెపి నాయకుడు సుబ్రమణ్య స్వామి, వైయస్ఆర్సిపి రాజ్యసభ ఎంపి వైవి సుబ్బారెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు గత అక్టోబర్ 4న ఇచ్చిన ఉత్తర్వులో, లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు (animal fat) ను ఉపయోగించారనే ఆరోపణపై దర్యాప్తును సిట్ నిర్వహిస్తుందని, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సెప్టెంబర్‌లో రాష్ట్రంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పాలనలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ను ఉపయోగించారని ఆరోపించడంతో పెద్ద రాజకీయ వివాదం (Tirupati laddu Issue) చెలరేగిన విషయం తెలిసిందే..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.