Monday, March 3Thank you for visiting

Surya Mitra | ప్ర‌తీ ఇంటిపై సోల‌ర్ ప్యానెల్స్.. ఇందుకోసం కొత్త‌గా 30వేల మంది సూర్య‌మిత్ర ఉద్యోగాల నియామ‌కం..

Spread the love

Surya Mitra | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి 30,000 మంది యువకులను “సూర్య మిత్రలు (Surya Mitra )గా తీసుకోవాల‌ని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కోటి సోలార్ రూఫ్‌టాప్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రారంభించిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఇంట్లో సౌర ఫలకాలను కలిగి ఉండాలనే లక్ష్యాన్ని సాధించడానికి, సౌరశక్తి రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం చాలా ఉందని ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (UPNEDA) సీనియర్ అధికారి PTIకి తెలిపారు.

ఇందుకోసం జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐలు)లో 30,000 మంది సూర్యమిత్రులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఏజెన్సీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ నైపుణ్యం కలిగిన మాన‌వ వ‌న‌రుల‌ను అభివృద్ధి చేసేందుకు, నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ ఒక ప్రణాళికను రూపొందించిందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని 3,000 మందికి పైగా యువకులు సోలార్ ప్రాజెక్ట్‌ల కోసం శిక్షణ కోర్సులను పూర్తి చేశారని, రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో సోలార్ ప్యానెల్‌లు ఉండాలనే ప్రధాని నరేంద్ర మోదీ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ఈ శిక్షణ సమిష్టి ప్రయత్నమని అధికారి తెలిపారు.

మూడు నెలల “సూర్య మిత్ర” కార్యక్రమంలో 600 గంటల సమగ్ర శిక్షణ, క్లాస్‌రూమ్ లు, ప్రాక్టికల్ లాబొరేటరీ వర్క్, సోలార్ ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ ప్లాంట్‌లకు ఎక్స్‌పోజర్, ఆన్-ది-జాబ్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఉన్నాయి.

ఈ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి, అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్ లేదా షీట్ మెటల్ వర్కర్‌గా ITI సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. శిక్షణ పూర్తయిన తర్వాత, వారికి ఉపాధి కల్పించడంలో సహాయం అందిస్తారు.
UPNEDA డేటా ప్రకారం, రాష్ట్రంలోని 18 లక్షలకు పైగా ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్‌ను అమర్చడానికి రిజిస్ట్రేషన్ పూర్తయింది. సుమారు రెండు లక్షల అదనపు ఇళ్ల కోసం దరఖాస్తులు వ‌చ్చాయి. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం “నెట్ బిల్లింగ్/నెట్ మీటరింగ్” విధానాన్ని ప్రవేశపెట్టింది. అదనంగా, UPNEDA ఉత్తరప్రదేశ్ అంతటా 10 లక్షల ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ అమర్చడానికి టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ కార్యక్రమం ఇటీవల వారణాసి నుంచి ప్రారంభమైంది.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version