Saturday, April 19Welcome to Vandebhaarath

2025 New Year celebrations : నూత‌న సంవత్స‌రం వేళ బెంగ‌ళూరు మెట్రో కొత్త అప్‌డేట్‌

Spread the love

2025 New Year celebrations : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్ర‌యాణికుల‌కు బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31, 2024న పర్పుల్, గ్రీన్ లైన్‌లలో విస్తరించిన మెట్రో రైలు సేవ‌ల‌ను విస్త‌రించింది. మెట్రో రైళ్లు డిసెంబ‌ర్ 31న అర్ధ‌రాత్రి నుంచి జనవరి 1, 2025న తెల్లవారుజామున 2:00 గంటల వరకు నడుస్తాయి. నాడప్రభు నుంచి చివరి రైలు స‌ర్వీస్ కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజెస్టిక్) కు 2:40 AMకి చేరుకుంటుంది.

BMRCL (Bangalore Metro ) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, డిసెంబర్ 31, 2024న రాత్రి 11 గంటల నుంచి ప్ర‌తీ 10 నిమిషాల వ్యవధిలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. పెద్ద సంఖ్యలో ప్ర‌యాణికుల రద్దీకి అనుగుణంగా MG రోడ్ మెట్రో స్టేషన్‌లో రాత్రి 11 గంటల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేయ‌నున్నారు. ప్రయాణికులు బదులుగా కబ్బన్ పార్క్, ట్రినిటీ వంటి సమీపంలోని స్టేషన్‌లను యాక్సెస్ చేయవచ్చు. ప్రయాణికులు తమ మెట్రో కార్డ్‌లు, స్టాండ‌ర్డ్‌ QR కోడ్ ద్వారా టిక్కెట్‌లను తీసుకోవ‌చ్చు. ఈ స్టేషన్ల నుంచి రాత్రి 11 గంటల తర్వాత ప్రయాణించాలనుకునే వారు రూ. 50 ధర కలిగిన రిటర్న్ జర్నీ పేపర్ టిక్కెట్‌ను కొనుగోలు చేయాలని సూచించారు.

Bangalore Metro సేవల పొడిగింపుతో సాఫీగా ప్రయాణించేందుకు, ప్రజల రద్దీని తగ్గించడానికి, నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించ‌డానికి దోహదం చేస్తాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version