
New Vande Bharat trains | రైలు ప్రయాణాలను ఆస్వాదించేవారికి ఇది నిజంగా శుభవార్త. ఒకే రోజు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య 51కి పైగా పెరిగింది. ఇవి దేశంలో 45 మార్గాలను కవర్ చేసేలా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంకల్ప శక్తికి ఈ రోజు సజీవ నిదర్శనమని, దేశ భవిష్యత్తును, రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దాలని యువతను కోరారు. ప్రస్తుతం, భారతీయ రైల్వేలు 24 రాష్ట్రాలు , 256 జిల్లాల్లో బ్రాడ్ గేజ్ విద్యుద్దీకరణ నెట్‌వర్క్‌ల ద్వారా రాష్ట్రాలను కలుపుతూ 41 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను అందిస్తున్నాయి.
నివేదికల ప్రకారం, ఢిల్లీ-కత్రా, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-వారణాసి, మైసూరు-చెన్నై, కాసరగోడ్-తిరువనంతపురం, మరియు కొత్త విశాఖపట్నం-సికింద్రాబాద్ మార్గంతో సహా ఆరు రూట్లలో ఇప్పుడు రెండు వందే భారత్ రైళ్లు ఉంటాయి. ఈ రైళ్లు ప్రధానంగా వివిధ రాష్ట్రాలలో విద్యుద్దీకరించబడిన బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లపై పనిచేస్తాయి. డిసెంబర్ 2023 లో, ప్రధాని మోడీ ఆరు అదనపు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అవి కత్రా నుండి న్యూఢిల్లీ, అమృత్‌సర్ నుండి ఢిల్లీ, కోయంబత్తూర్ నుండి బెంగళూరు, మంగళూరు – మడ్గావ్, జల్నా నుండి ముంబై మరియు అయోధ్య నుండి ఢిల్లీ వంటి మార్గాలలో కనెక్టివిటీని మెరుగుపరిచారు.
కొత్త 10 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాలు..
- లక్నో-డెహ్రాడూన్ (Lucknow-Dehradun)
- అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ (Ahmedabad-Mumbai Central)
- జల్పైగురి-పాట్నా (New Jalpaiguri-Patna)
- పాట్నా-లక్నో(Patna-Lucknow)
- ఖజురహో-ఢిల్లీ (నిజాముద్దీన్) (Khajuraho-Delhi (Nizamuddin))
- పూరి-విశాఖపట్నం (Puri-Visakhapatnam)
- కలబురగి-సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు (Kalaburagi–M Visvesvaraya Terminal Bengaluru)
- రాంచీ-వారణాసి (Ranchi-Varanasi)
- మైసూరు- MGR సెంట్రల్ (చెన్నై) (Mysuru-Dr. MGR Central (Chennai))
- సికింద్రాబాద్-విశాఖపట్నం
నాలుగు రైళ్ల పొడిగింపు
అదనంగా, ప్రధాని మోడీ ఇప్పటికే ఉన్న నాలుగు వందే భారత్ రైళ్లను పొడిగించారు.. గోరఖ్‌పూర్-లక్నో ఎక్స్ ప్రెస్ ప్రయాగ్‌రాజ్ వరకు, తిరువనంతపురం-కాసర్‌గోడ్ రైలు నుండి మంగళూరు వరకు, అహ్మదాబాద్-జామ్‌నగర్ రైలు ద్వారక వరకు, అజ్మీర్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా చండీగఢ్ వరకు పొడిగించారు.
భారతీయ రైల్వేలు 2019లో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదట్లో వేగవంతమైన ప్రయాణానికి ఒక నమూనాగా నిలిచాయి. అ తర్వాత ఈ రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు పొందుపరిచారు. దీంతో వీటిపై ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. , రైలు హై స్పీడ్ యాక్సిలరేుషన్, ఎల్ఈడీ లైటింగ్, ఎయిర్‌క్రాఫ్ట్- మోడల్ టాయిలెట్‌లు, పర్సనలైజ్డ్ రీడింగ్ లైట్లు, ఆటోమేటిక్ ఇంటర్‌కనెక్టింగ్ డోర్లు, ఫుల్ సీల్డ్ గ్యాంగ్‌వేలు, ఆధునిక లగేజ్ రాక్‌లు, యూరోపియన్ తరహా సీట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అయితే భారతీయ రైల్వేలు ఇప్పుడు రాత్రిపూట ప్రయాణం కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు సంబంధించి స్లీపర్ కోచ్ లతో కొత్త వందేభారత్ రైళ్లను తీసుకొస్తోంది. దీని ప్రోటోటైప్‌ను బెంగళూరులో BEML తయారు చేస్తోంది. ఇటీవల, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్ వెర్షన్ కారు బాడీని ప్రారంభించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..